Friday, February 12, 2010

ఎందుకో మనసెందుకో...

ఎందుకో మనసెందుకో కొంత కలవరం పడుతోంది...
నీవుగా నీ నీడగా ఉండాలనీ అంటోంది...
ఎంత చెప్పినా వినవీ మాట...
ఎప్పుడమ్మ నీ దయ నా మీద..
కలను దాటి నువ్వు నిజమై చేరవా నేస్తమా...గుండెలో ప్రాణమా...

ఒక హృదయం...

క్రితం జన్మ గుర్తులేదు...మరు జన్మ తెలియదు...
కాని నీ ప్రేమ కోసం ఆజన్మాంతం వేచి ఉంటాను..
నా ప్రేమను గుర్తించేందుకు కాలం చాలు అని నువ్వనుకునేంత వరకు చాలా కాలం వేచి ఉంటాను..
నీ దృష్టిలో నా ప్రేమ త్వరగా కరిగిపోయే మేఘాల వంటిది...
కాని నా ప్రేమ మేఘాల పైన ఎప్పటికీ నిలిచి వుండే ఆకాశం వంటిది...నిర్మలమైనది...
నీ ప్రేమ అనే జీవితం నాకిస్తావని ఆశిస్తూ....
ఒక హృదయం...

ప్రియతమా...

ఎంత కాలం ప్రియతమా....
ఇంత మౌనం ప్రణయమా...
నాకు నీలో హృదయమా...
స్ధానముందా జన్మలో...

ఆర్పితం జీవితం...నేస్తమా నీకోసమే..

నీ కోసం

ధ్యానం చేస్తున్నా చెలియా ధ్యానం చేస్తున్నా
నా శ్వాసలో ఉన్నవే నీ ధ్యానం చేస్తున్నా
అనుమతి పొందకనే గుండెలో ధ్యానం చేస్తున్నా
పెదవి తెరువకనే మనసులో ధ్యానం చేస్తున్నా
పెదవి తెరిచి అనుమతి కోరిన...కలవై నువ్వు కరిగిపోజాలకే...

Thursday, February 11, 2010

నా ప్రాణమా

ఎన్నో వేల క్షణాలున్న జీవితంలో నేను కోరుకునే ఒకే ఒక్క క్షణం నువ్వు

ఎన్నో వేల కలల కోసం వెతికే నాకు ఒకే ఒక్క నిజమైన కల నువ్వు

ఎన్నో వేల అబద్ధాలున్న ప్రపంచంలో నేను చుసిన ఒకే ఒక్క నిజం నువ్వు

ఎన్నో వేల దూరాలున్న ప్రపంచంలో నాకు ఉన్న ఒకే ఒక్క శాశ్వతం నువ్వు

ఎన్నో వేల సంతోషాలున్న ప్రపంచంలో నాకు ఎప్పటికీ ఉండే నిజమైన సంతోషం నువ్వు

ఎన్నో వేల బాధలున్న ప్రపంచంలో బాధే తెలియని ఒకే ఒక్క ఆనందం నువ్వు

ఎన్నో
వేల మౌనాలున్న ప్రపంచంలో నేను విన్న ఒకే ఒక్క సంగీతం నువ్వు


Tuesday, February 9, 2010

మౌనరాగం..

అనుక్షణం నిన్ను ఆరాధించే మౌనంలోని
ఆవేదనను నీకు ఆశతో చెప్పుకోవాలని ఆరాటపడే
మూగ ప్రేమికుని ఆతృతను అర్ధం చేసుకోవా..
నీ...
మౌనరాగం..